WOLF Teaser -Telugu
View Trailer
WOLF teaser: ప్రభుదేవా, అనసూయల 'వూల్ఫ్' టీజర్ రిలీజ్: ఆకలితో ఉన్న తోడేలు వేట ప్రారంభం!
ప్రభుదేవా, అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వూల్ఫ్'. టైటిల్ పోస్టర్ తో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేసారు.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.. హీరోగానూ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని, డైరెక్టర్ గానూ సత్తా చాటారు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న ఆయన, ప్రస్తుతం డైరెక్షన్ - కొరియోగ్రఫీ కంటే నటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'వూల్ఫ్' (Wolf) అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
'వుల్ఫ్' అనేది సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అని టీజర్ ని బట్టి అర్థమవుతుంది. మూవీ సెటప్ అంతా చూస్తుంటే మంత్రాలు, క్రుద్ర పూజలు, తాంత్రిక, అతీంద్రియ శక్తుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభుదేవాతో పాటుగా రాయ్ లక్ష్మి, అనసూయ భరద్వాజ్, అంజు కురియన్, శ్రీ గోపిక, వశిష్ఠ సింహా తదితరులు ఇతర కీలక పాత్రలల్లో కనిపిస్తున్నారు. పెద్దగా డైలాగ్స్ లేకుండా, కథేంటి అనేది తెలియకుండా కట్ చేసిన ఈ టీజర్.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఇందులో ప్రభుదేవా ముఖానికి మాస్క్ తగిలించి, అతన్ని గొలుసులతో ఒక చోట బంధించి ఉంచారు. అతనిపై ఏవో క్రుద్ర పూజ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా అక్కడ నుంచి బయటపడటానికి ప్రయత్నించే క్రమంలో వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అనసూయ ఒక మంత్రగత్తెని పోలిన పాత్రలో పరవశంతో ఊగిపోతూ కనిపించింది. ఇందులో ఆమెది పవర్ ఫుల్ రోల్ అని అర్థమవుతోంది. ఆ పాత్రకు సంబంధించి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు.