Sree Blog
AboutContact

UITheMovie - First Look Teaser

View Trailer
UITheMovie - First Look Teaser

UI The Movie | క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేశారు.


ఈ టీజ‌ర్ లాంఛ్ కార్యక్రమానికి క‌న్న‌డ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా రాగా.. వ‌ర‌ల్డ్ ఆఫ్ యూఐ పేరిట ఉన్న ఈ టీజ‌ర్‌ను శివ‌న్న విడుద‌ల చేశాడు. ఇక ఈ టీజ‌ర్ చూస్తే.. ‘UI’ అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌లో ఈ సినిమా స్టోరీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. క‌థ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వ‌కుండా ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా ఈ టీజ‌ర్ సాగింది. ఇక ఈ మూవీలో ఉపేంద్ర దున్న‌పోతుపై ఎంట్రీ ఇవ్వ‌డం చూస్తుంటే డెమి గాడ్‌గా క‌నిపించ‌బోతున్నట్లు స‌మాచారం.