Tiger's Invasion (Telugu)
View Trailer
Tiger's Invasion: టైగర్ నాగేశ్వర రావు టీజర్ రిలీజ్.. భయంకరమైన దండయాత్ర షురూ చేసిన మాస్ రాజా
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా ఈమూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ రాజా రవితేజ టీజర్ తోనే..టైగర్ గా భయంకరమైన దండయాత్ర చేసినట్లు తెలుస్తోంది.
టీజర్ స్టార్ట్ అవుతూనే..కొన్ని ప్రముఖ నగరాల్లో అతి దారుణంగా దోపీడీలు చేసిన స్టువర్ట్ పురం దొంగ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నట్లు టీజర్లోకి తీసుకెళ్లారు మేకర్స్.ఈ టైగర్ నాగేశ్వర రావు మూవీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని వస్తుండటంతో ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుంది.ఈ మూవీలో స్పెషల్ ఆఫీసర్గా అనుపమ ఖేర్(Anupama Kher) నటిస్తున్నారు.
టైగర్ నాగేశ్వర రావు కోసం దేశవ్యాప్తంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే ఈ మూవీలో DSP రోల్ చేస్తున్నారు యాక్టర్ మురళీశర్మ(Murali sharma). నాగేశ్వరరావును పట్టుకునే బాధ్యతను మురళీ శర్మకు అనుపమ ఖేర్ అప్పగిస్తారు. అనుపమ ఖేర్ ఆంధ్ర ప్రదేశ్ మ్యాప్ ను చూపిస్తూ..గుంటూరు,తెనాలి,బాపట్ల ప్రాంతాలను చూపిస్తూ..ఈ జోన్ అంతా టైగర్ నాగేశ్వరరావుది(రవితేజ) అంటూ రవితేజ కు ఇంట్రో ఇచ్చే డైలాగ్ ఆకట్టుకుంది.
నాగేశ్వర రావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివి తేటలతో.. పాలిటిక్స్ నే గెలిచేవాడు, స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే ఇండియాకి మెడల్ తెచ్చేవాడు, ఆర్మీకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధాన్నే గెలిచేవాడు..కానీ ఒక క్రిమినల్ అయ్యాడు అని..మురళీశర్మ చెప్పే డైలాగ్ టీజర్కే హైలెట్ గా నిలిచింది.
అలాగే టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కు కిక్కిచ్చేలా ఉన్నాయి. పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు..అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్ చూస్తుంటే టైగర్ రోల్ లో ప్లే చేసిన రవితేజ క్యార్టెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా ఉండనుందో అర్థమవుతోంది. బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న ట్రైన్‍కు తాడు వేసి టైగర్ నాగేశ్వరరావు..చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ టీజర్‌కే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ఇక జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంటెన్స్‌గా సాగింది.
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్(Nupur Saonon ) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్(Abhishek Agarwal Arts Byanar) పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(gvprakash) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.