Sree Blog
AboutContact

Simbaa - Official Trailer

View Trailer
Simbaa - Official Trailer

‘సింబా’ ట్రైల‌ర్‌: వృక్షో ర‌క్షిత ర‌క్షితః

చెట్ల‌ని పెంచండి… ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించండి అంటే అదేదో మెసేజ్ ఇచ్చిన‌ట్టే ఉంటుంది. ఇదే పాయింట్ ని థ్రిల్ల‌ర్ కోణంలో చెబితే, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని మిక్స్ చేస్తే త‌ప్ప‌కుండా ఓర‌క‌మైన ఆస‌క్తి క‌లుగుతుంది. ‘సింబా’ కోసం అదే చేశారు. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషించిన సినిమా ఇది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ అందించారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఆగ‌స్టు 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. చెట్ల‌ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని చెప్పే క‌థ ఇది. అయితే దాని చుట్టూ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, స‌స్పెన్స్ ఉండేలా చూసుకొన్నారు. కాలుష్యం వ‌ల్ల ఎంత ప్రాణహాని జ‌రుగుతుందో ట్రైల‌ర్ లోని కొన్ని సంభాష‌ణ‌లు వింటుంటే అర్థం అవుతోంది. గౌత‌మి లాంటి సీనియ‌ర్ ఆర్టిస్టులు తెర‌పై క‌నిపించ‌డం ఈక‌థ‌కు మ‌రింత బలాన్ని ఇచ్చింది. అన‌సూయ మ‌రోసారి డేరింగ్ అండ్ డాషింగ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఆమెపై కొన్ని యాక్ష‌న్ సన్నివేశాల్నీ తీర్చిదిద్దారు. ఓ బ‌ల‌మైన సామాజిక అంశానికి, ఆస‌క్తిక‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థం అవుతుంది. కాలుష్యం కోర‌ల్లో ప్ర‌పంచం చిక్కుకొన్న ఈ నేప‌థ్యంలో, ఈ సినిమాలో ఇంకెన్ని కొత్త విష‌యాలు చెప్పారో తెలియాలంటే ఆగ‌స్టు 9 వ‌ర‌కూ ఆగాలి.