Sree Blog
AboutContact

Satyabhama Teaser

View Trailer
Satyabhama Teaser

Satyabhama Teaser : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య భగవంత్ కేసరిలో ప్రధాన పాత్ర పోషించిన కాజల్.. ఆ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు తన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘స‌త్య‌భామ’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కాజల్ కెరీర్ లో 60వ మూవీగా తెరకెక్కుతుంది. దీంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

జూన్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ పుట్టినరోజు సంద‌ర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. ఇప్పుడు వరకు చందమామలా కనిపించిన కాజల్.. ఆ గ్లింప్స్ లో యుద్దానికి దిగిన సత్యభామలా కనిపించిన అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు దీపావళి సందర్బంగా మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లోనే ఓ రేంజ్ యాక్షన్ చూపించిన కాజల్.. టీజర్ లో అంతకుమించి అదరగొట్టేశారు. కాజల్ ఫ్యాన్స్ కి టీజర్ దీపావళి బనోంజాలా ఉంది.

టీజర్ చూస్తుంటే.. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమవుతుంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామ హ్యాండిల్ చేస్తున్న కేసులో అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడం, సత్యభామని ఆ కేసు నుంచి తొలిగించడం, కానీ తను వల్ల ఒక తప్పు జరిగిందన్న కోపంతో సత్యభామ.. ఆ కేసుని ఆఫ్ డ్యూటీలో ఇన్‌వెస్టిగేషన్ చేయడం సినిమా కథ అని తెలుస్తుంది.ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ సత్యభామగా కాజల్ వావ్ అనిపిస్తున్నారు. అఖిల్ డేగల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.