Sree Blog
AboutContact

Samajavaragamana

View Trailer
Samajavaragamana

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సామజవరగమన(Samajavaragamana). జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. రిలీజైన మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. అదే రేంజ్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. కేవలం రూ.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా.. రూ.11 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గుంరించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సామజవరగమన ఓటీటీ(Samajavaragamana OTT) హక్కులను నెట్‌ఫ్లిక్స్(Netflix) డీసెంట్ రేట్ కు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జులై 22న లేదా 25న సామజవరగమన ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.