Rangabali
View Trailer
Rangabali OTT Platform: నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకున్నది. ఏ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుందంటే...
రంగబలి సినిమాతో ఈ శుక్రవారం (జాలై7న) ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగశౌర్య(Naga shaurya). మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తొలిరోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. రిలీజ్ ముందునుంచే సినిమాపై హైప్ ఉండటంతో టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఈ మూవీ భారీగానే ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా రంగబలి ఏ ఓటీటీలో (OTT) రిలీజ్ కానుందన్నది క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. నాగశౌర్యకు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు ఏడు కోట్లకు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఆగస్ట్ సెకండ్ వీక్‌లో రంగబలి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. రంగబలి సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలో యుక్తతరేజా(Yukti Thareja) హీరోయిన్‌గా నటించింది. సొంత ఊరిలోని రంగబలి అనే సెంటర్ కారణంగా ఓ యువకుడి ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఈ మూవీ కథ. తన ప్రేమ కోసం స్థానిక ఎమ్మెల్యేతో అతడు ఎలాంటి పోరాటం సాగించాడన్నది రొమాన్స్, కామెడీ, యాక్షన్ అంశాలతో దర్శకుడు స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
నాగశౌర్య యాక్టింగ్‌తో పాటు సత్య కామెడీ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. రంగబలి సినిమాలో మురళీశర్మ, శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి రంగబలి మూవీని నిర్మించారు.