Om Bheem Bush Trailer
View Trailer
Om Bheem Bush Trailer : ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో ఆకట్టుకున్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్.. మరోసారి రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘ఓం భీమ్ బుష్’. టైటిల్ లోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్న చిత్ర యూనిట్.. టీజర్ అండ్ మ్యాడ్ ప్రమోషన్స్ తో క్రేజీ ఫీల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు మరింత మ్యాడ్ ఫీల్ కలిగించేందుకు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
కాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. ‘హుషారు’ మూవీ ఫేమ్ హర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి బ్రోచేవారెవరురా సినిమాలో ఫుల్ గా నవ్వించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లేదు చూడాలి.