NaaNaa Hyraanaa | Game Changer
View Trailer
Lyrics:
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న

పల్లవి:
నానా హైరాణా
ప్రియమైన హైరాణా
మొదలాయే నాలోన
లలనా నీ వలన
నానా హైరాణా
అరుదైన హైరాణా
నెమలీకల పులకింతై
నా చెంపలు నిమిరేనా
దానా.. దీన.. ఈ వేళ
నీ లోన నా లోన
కానివినని కలవరమే
సుమశరమా..
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె…..
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
చరణం:
ఎప్పుడూ లేని
లేని వింతలు
ఇప్పుడే చూస్తున్నా….
గగనాలన్నీ పూల గొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరూ లేని
లేని దీవులు
నీకూ నాకేనా
రోమాలన్నీ నేడు
మన ప్రేమకు జెండాలాయె
ఏమాయో మరి ఏమో
నరనరము నైలు నదాయె
తనువే లేని ప్రాణాలు
తారాడే ప్రేమల్లో
అనగనగ సమయంలో
తొలి కథగా….