Sree Blog
AboutContact

Miss Shetty Mr Polishetty Telugu Trailer

View Trailer
Miss Shetty Mr Polishetty Telugu Trailer

Miss Shetty Mr Polishetty : చాన్నాళ్లకు కన్నడ అందం అనుష్క (Anushka Shetty) మరో సినిమాతో తెలుగులో పలకరించబోతోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అంటూ వస్తోన్న ఈచిత్రంలో మరో ప్రధాన పాత్రలో యువ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 07న విడుదలకానున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

Blog Post Image

బాహుబలితో దేవసేనగా దేశ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి (Anushka Shetty), మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). ఇప్పటి వరకు టీజర్స్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబర్ 07న భారీగా విడుదలకానున్న నేపథ్యంలో టీమ్ తాజాగా ట్రైలర్‌ను (Miss Shetty Mr Polishetty Trailer) విడుదల చేసింది. ట్రైలర్ మాత్రం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. లండన్ నుంచి వచ్చిన ఓ చెఫ్‌కు, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఓ యువకుడికి మధ్య రిలేషన్ షిప్‌ను దర్శకుడు ఎంటర్టైనింగ్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌లో డైలాగ్స్ మాత్రం ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం అని అంటున్నారు నెటిజన్స్.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆమధ్య విడుదల చేసిన టీజర్‌కు (Miss Shetty Mr Polishetty Teaser), లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ సంస్థ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 07న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రవళి పాత్రలో నటించిన అనుష్క ప్రొఫెషనల్ చెఫ్. పెళ్లంటే ఇష్టం ఉండదు. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇటు పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా స్టాండప్ కమెడియన్ గా రాణించాలని ప్రయత్నించే మరో కుర్రాడు. ఈ ఇద్దరికీ అనుకోకుండా పరిచయమై ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. మరి ఆ స్నేహం ఏ తీరాలకు చేరింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ ట్రైలర్‌లో అనుష్క, నవీన్‌ల మధ్య మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. 

బ్యానర్ : యూవీ క్రియేషన్స్,

ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,

విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి,

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు,

సంగీతం : రధన్,

సినిమాటోగ్రఫీ : నీరవ్ షా,

నిర్మాతలు : వంశీ - ప్రమోద్ - విక్రమ్,

రచన, దర్శకత్వం : పి. మహేష్ కుమార్.