Mem Famous Movie In OTT: ఓటీటీలో మేమ్ ఫేమస్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
View Trailer
Mem Famous | డెబ్యూ యాక్టర్లు సుమంత్ ప్రభాస్, సార్య కాంబోలో వచ్చిన చిత్రం మేమ్ Famous (Mem Famous). విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించాడు. మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే తన సత్తా చాటేందుకు రెడీ అయింది.
మేమ్ Famous అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంకేంటి.. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసేయండి మరి. ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథతో మేమ్ Famous తెరకెక్కిన ఈ మూవీని టాప్ ప్రొడక్షన్ బ్యానర్ గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి విడుదల కావడం కూడా సినిమాకు బాగా కలిసొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో మణి అగురియా, మౌర్య చౌదరి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు.