Sree Blog
AboutContact

Malle Poola Taxi Full Video

View Trailer
Malle Poola Taxi Full Video

Lyrics:

సిన్నప్పుడెప్పుడో తినిపిస్తినని మసాలా దోశ
పిలిసి పప్పన్నం పెడుతున్నవురా మల్లేశా
పొట్టి లాగులుండేటోనివి
పొడుగు లాగులదైతివి బిడ్డా
యాది పెట్టుకొని పెండ్లి కార్డ్ ఏసినవని
ఎర్ర బస్సేకి వచ్చేసిండ్రా మల్లేశా

నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకి నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే
బుగ్గ చుక్క పెట్టుకున్న
అందాల చండాల బంతిరెక్కా
ఏరి కోరి సరైనోడినే
ఎంచుకుంది ఎంచక్కా
పెళ్లి పిల్లా పిల్ల గాడి జోడి అదిరేనే
ఈ ఇద్దరి జంట చూసినోళ్ళ
కళ్ళు చెదిరేనే

మల్లెపూల అరే మల్లెపూల
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా

నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకి నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే

రాములోడి వారసుడే కిట్టమూర్తి కాడసలే
కట్టుకున్న పెళ్ళానికే కట్టుబడతడే
ఆఫీసైతే ల్యాప్‌టాప్ ఇంటికొస్తే టీవీ స్క్రీన్
అటు ఇటు ఎటు పక్క చూపులు చూడడే
5G సిగ్నల్ లా పిల్లనొదిలి పెట్టి పోడే
లవ్ ఎమోజి సింబల్ లా ఎంట ఎంట తిరుగుతాడే

నువ్ మల్లెపూల అరే మల్లెపూల
హే మల్లెపూల మల్లెపూల
మల్లెపూల మల్లెపూల మల్లెపూల
మల్లెపూల నువ్వు మల్లెపూల
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా

నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకి నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే

అమెరికా సాఫ్ట్‌వేరే
రిచ్చో రిచ్ కోహినూరే
నిన్ను కోరి వచ్చినాడే పాష్ పోరడే
రొమాంటిక్ మన్మదుడే
సొంత ఫ్లైట్ లో తిప్పుతాడే
గింత కూడ పెళ్ళాం ఒళ్ళు నలగనియ్యడే
ఏ పిల్లైనా వెనుకబడే ఇన్‌స్టా రీలు వీడే
మన పిల్లంటే మోజుపడి ఇట్లా వచ్చినాడే

హే మల్లెపూల అరే మల్లెపూల
మల్లెపూల మల్లెపూల
మల్లెపూల మల్లెపూల మల్లెపూల
మల్లెపూల నువ్ మల్లెపూల
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా
అరే మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా

నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకి నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే