Sree Blog
AboutContact

Maa Oori Polimera-2

View Trailer
Maa Oori Polimera-2

Maa Oori Polimera-2 Teaser | రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్‌ నటనైతే వేరే లెవల్‌. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్‌ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు. ఈ సినిమా సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకోవడంతో సీక్వెల్‌ను వెంటనే ప్రకటించారు. కానీ మేకింగ్‌కు కాస్త టైమ్‌ తీసుకున్నారు.

గతేడాది ద్వితియార్థంలో షూటింగ్‌ ప్రారంభించి ఈ ఏడాది ప్రథమార్థంలో కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌లో ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ.. ఈ సినిమాలో చేతబడిని మరింత క్రూరంగా చూపించనట్లు అర్థమయింది. అంతేకాకుండా తొలిపార్టు మొత్తం ఒక ఊరిలోనే సాగగా.. సెకండ్‌ పార్ట్‌ మాత్రం పలు లొకేషన్‌లలో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. చంపితే తప్పు కానీ బలి ఇస్తే తప్పేంటి అనే డైలాగ్ సినిమాపై క్యారియాసిటీ నెలకొల్పింది. చివర్లో సత్యం రాజేష్‌ రక్తాన్ని ఒంటిమీద పోసుకునే సీన్‌ అయితే టీజర్‌కే హైలేట్‌గా నిలిచింది మొత్తంగా టీజర్‌ చూస్తుంటే మాత్రం తొలిపార్టుకు మించి సెకండ్ పార్టు ఉత్కంఠ భరితంగా సాగనున్నట్లు స్పష్టమవుతుంది.

అనీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలాదిత్య మరో ప్రధాన పాత్రలో నటించాడు. డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ, చిత్రమ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరీ కృష్ణ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండియర్‌గా రూపొందించాడు.