Sree Blog
AboutContact

Kushi Movie: ‘ఆరాధ్య’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ, సమంత జోడికి ఫ్యాన్స్ ఫిదా

View Trailer
Kushi Movie: ‘ఆరాధ్య’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ, సమంత జోడికి ఫ్యాన్స్ ఫిదా

‘ఆరాధ్య’ ఫుల్ సాంగ్

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాతో మరోసారి జోడీ కట్టనున్నారు సామ్ అండ్ విజయ్. గతంలో వీరిద్దరు కలిసి మహానటి సినిమాలో నటించగా.. ఇప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ ప్రేమికులందరినీ కట్టిపడేసిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ తెలుగులో రాశారు. ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే పాటను కూడా శివ రాశారు. ఇక ఇదే పాటకు తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా కావడం ఖాయం. ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా కానున్నారని తాజాగా విడుదలైన సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’ కూడా మైమరపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఇందులో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటిస్తున్నారు.