Sree Blog
AboutContact

Gorre Puranam - Official Trailer

View Trailer
Gorre Puranam - Official Trailer

Gorre Puranam: గొర్రె పై కేసు ఏంటి..? ఆసక్తికరంగా గొర్రె పురాణం ట్రైలర్!

సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గొర్రె పురాణం'. తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో రెండు మతాల మధ్య గొడవలకు గొర్రె ఎలా కారణమైంది? అసలు గొర్రెకు హీరోకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
Gorre Puranam: టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

గొర్రె పురాణం ట్రైలర్

నా పేరు రామ్ అలియాస్ ఏసు.. గొర్రె జైల్లో ఉండడం ఏంటీ..? అక్కడి నుంచి తప్పించుకోవడం ఏంటి? ఇదంతా వింతగా ఉంది కదా..! రోజు సోషల్ మీడియాలో మీరు చూసే వింత వీడియోల కంటే విచిత్రమైతే కాదులే.. అనే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ గొర్రె చేసిన పని వల్ల రెండు మతాల మధ్య గొడవ మొదలైనట్లుగా చూపించారు. దీంతో ఆ ఊరి ప్రజలు ఆ గొర్రెను చంపాలని అనుకుంటారు. మరోవైపు సుహాస్ ఆ గొర్రెను కాపాడుతున్నట్లుగా, గొర్రెలో అతను ఒక అమ్మాయి రూపాన్ని చూసుకుంటున్నట్లుగా చూపించారు. అసలు ఊరి ప్రజలు గొర్రెను చంపడానికి గల కారణమేంటి..? గొర్రెకు హీరోకు సంబంధం ఏంటి? లేదా గొర్రె రూపంలో ఉన్నది హీరోనేనా? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.