Extra - Ordinary Man
View Trailer
Extra Ordinary Man : శ్రీలీలతో నితిన్ డ్యూయెట్ సాంగ్ అదిరిపోయింది.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..
Extra Ordinary Man : స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ (Nithiin), శ్రీలీల (SreeLeela) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ.. ఇటీవలే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ జర్నీ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
‘డేంజర్ పిల్ల’ అంటూ సాగే ఈ డ్యూయెట్ ని అర్మాన్ మాలిక్ పాడాడు. ఇక ఈ పాటకి శేఖర్ మాస్టర్ స్టైలిష్ స్టెప్పులతో డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. డిసెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్రంతో పాటు నితిన్ VNRTrio మూవీని కూడా చేస్తున్నాడు. భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీకుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే భీష్మ తరువాత నితిన్ 4 సినిమాలు చేస్తే.. నాలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
కాగా వక్కంతం వంశీకి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ దర్శకుడిగా రెండో సినిమా. అల్లు అర్జున్ తో తీసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు రెండో మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టి దర్శకుడిగా తనని తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరి నితిన్ అండ్ వంశీకి ఒకేసారి కాలం కలిసి వస్తుందా? లేదా? చూడాలి.