Sree Blog
AboutContact

Chhaava Telugu Trailer

View Trailer
Chhaava Telugu Trailer

Chhaava Telugu Trailer: ఛావా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్ ఫుల్ డైలాగ్స్.. గూస్ బంప్స్ పక్కా..

Blog Post Image

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటేస్ట్ మూవీ ఛావా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గత నెలలో హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్ట్ర లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెకక్కించారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయగా.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ధైర్యం, కీర్తిల గొప్ప మేళయింపుతో ఆవిష్కృతమైన అద్భుతమైన దృశ్యకావ్యం ఇప్పుడు తెలుగులో వస్తోందంటూ ట్రైలర్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తం 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.