BRAHMAANANDAM GLIMPSE
View Trailer
బ్రహ్మా ఆనందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ వెండితెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.
డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నువ్వు రాఖీ కట్టి గిఫ్ట్ అడిగితే ఏమీ ఇచ్చాను అనే గౌతమ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది.
డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా గౌతమ్ కనిపిస్తున్నాడు. వెన్నెల కిశోర్ కామెడీ డాక్టర్‌గా కనిపించనున్నాడు. వీరిద్దరు కామెడీ బాగుంది. ఇక ఆఖర్లో బ్రహ్మానందం ఎంట్రీ అదిరిపోయింది.