Sree Blog
AboutContact

Boys Hostel

View Trailer
Boys Hostel

ర‌ష్మీ గౌత‌మ్, తరుణ్ భాస్కర్ గెస్ట్ లుగా...దుమ్ము రేపే కంటెంట్ తో ...

ఈ సినిమాలో యాంకర్‌ రష్మీ ఉండటం అందరకీ షాక్‌ను గురి చేసింది. తెలుగు వెర్షన్‌ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్‌ చేశారు. ఇక ట్రైలర్‌ చివర్లో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను కూడా చూపించారు.


కన్నడ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో ఓ రేంజి మార్కెట్ క్రియేట్ అయ్యింది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్‌ రోణ అంటూ అక్కడ సినిమాలు ఇక్కడ దుమ్ము దులిపాయి. ముఖ్యంగా అవుట్‌ ఆఫ్ ది బాక్స్‌ సినిమాలు బాగా వస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు మరో సినిమా మన ముందుకు వస్తోంది. క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌యం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే..డబ్బింగ్ వెర్షన్ ని ఇక్కడ నేటివిటి అనిపించేందుకు .. ర‌ష్మీ గౌత‌మ్, తరుణ్ భాస్కర్ గెస్ట్ లుగా తీసుకున్నారు.

ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యే స‌న్నివేశాలు ఎక్కువ‌గా క‌నిపించాయి. . అనుకోకుండా హాస్టల్‌ వార్డన్‌ చనిపోవడం.. ఆ చావుకు కారణం హాస్టల్‌లో ఉండే ఓ గ్యాంగ్‌ అని చూపించడం.. దాంతో పానిక్‌ అయిన ఆ గ్యాంగ్‌ ఓ సీనియర్‌ హెల్ప్‌ తీసుకుని ఆ శవాన్ని యాక్సిడెంట్‌ అని క్రియేట్‌ చేయడం ఇలా క్రైమ్‌ చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్‌ చూపించారు.

ర‌ష్మీ గౌత‌మ్ టీచ‌ర్‌గా న‌టించింది. రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, తరుణ్ భాస్కర్లు గెస్ట్ రోల్స్‌లో న‌టించారు. నితిన్ కృష్ణమూర్తి క‌న్న‌డ‌లో ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. వ‌రుణ్ గౌడ‌, ప్ర‌జ్వ‌ల్ అర‌వింద్ క‌శ్య‌ప్‌ల‌తో క‌లిసి గుల్మొహర్ ఫిలిమ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ర‌ష్మి గౌత‌మ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వారం రోజుల్లోనే ఓకే అయ్యింద‌ని, అంతే ఫాస్ట్‌గా షూటింగ్ పూర్తి అయిన‌ట్లు చెప్పింది. క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉన్న‌ట్లు తెలిపింది. మంచి సినిమాలో భాగం కావ‌డం ఆనందాన్ని ఇచ్చిన‌ట్లు చెప్పింది.