Sree Blog
AboutContact

Bharateeyudu 2 Trailer

View Trailer
Bharateeyudu 2 Trailer

Bharateeyudu2 Trailer: సేనాప‌తి స్వైర విహారం.. బాక్సాఫీస్ బద్దలే..

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జీరో టాల‌రెన్స్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై (RedGaint Movies) సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu2). జీరో టాల‌రెన్స్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మేకర్స్ ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు