Anaganaga Oka Raju - Pre Wedding Video
View Trailer
నవీన్ ఈజ్ బ్యాక్ - నవ్వులు పూయిస్తున్న ప్రీ వెడ్డింగ్ వీడియో! - మీరు చూశారా? - ANAGANAGA OKA RAJU TEASER
Anaganaga Oka Raju Pre Wedding Video : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో సక్సెస్ సాధించిన స్టార్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'అనగనగ ఒక రాజు' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌తో ఆడియెన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ మేకర్స్ మరో స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అలరించారు.
నవీన్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఆ గ్లింప్స్ ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా నెట్టింట సందడి చేస్తోంది. అందులో నవీన్ ఎప్పటిలాగే తన మార్క్ కామెడీ పంచ్‌లతో అలరించారు. ఇక నటి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. గ్లింప్స్‌లో కొన్ని సెకెండ్స్ పాటు ఆమె మెరిసి సందడి చేశారు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.